Skip to main content

Namaste NRI

చిక్కుల్లో  బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ను రష్యా గూఢచారులు హ్యాక్‌ చేశారు.  ఆమె వ్యక్తిగత ఫోన్‌ను రష్యా హ్యాక్‌ చేసినట్టు స్థానిక పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది.   రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కోసం పని చేస్తున్న గూఢచారులు ఈ పని చేసినట్లు పేర్కొంది.లిజ్‌ ట్రస్‌ యూకే విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా గూఢాచారులు ఈ హ్యాక్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని లిజ్‌ ట్రస్‌ ప్రధాని పదవి చేపట్టాక గుర్తించారు. మిత్రదేశాలతో చర్చలకు సంబంధించిన కీలక రహస్యాలు రష్యా చేతిలో పడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి పలువురు విదేశాంగ మంత్రులతో లిజ్‌ట్రస్‌ జరిపిన సంభాషణలు, ఆయుధ సరఫరా రహస్యాలు కూడా పుతిన్‌ చేతికి చిక్కినట్టు అనుమానిస్తున్నారు.

               అలాగే బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను విమర్శిస్తూ లిజ్‌, క్వాసి క్వార్టెంగ్ మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రష్యా గూఢచారులు హ్యాక్‌ చేసినట్లు డైలీ మెయిల్‌ తెలిపింది. ఈ సమాచారంతో ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేసింది. అయితే ఆ సమయంలో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న సైమన్ కేస్, బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ హ్యాక్ సమాచారాన్ని తొక్కిపెట్టినట్లు ఆ రిపోర్ట్‌ పేర్కొంది. హ్యాక్‌ అయిన లిజ్‌ ట్రస్‌ వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌ ప్రస్తుతం ప్రభ్వుత్వ ఆధ్వర్యంలోని సురక్షిత కేంద్రంలో ఉన్నట్లు వివరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events