బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకంజలో ఉన్న రిషి సునాక్‌కు తాజాగా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఓ కీలక నేత మద్దతు లభించింది. బ్రిటన్ ప్రధాని పదవికి రిషియే తగినవవారంటూ ఎంపీ, బ్రిటన్ మాజీ మంత్రి మైఖేల్ గోవ్ ప్రకటించారు. రిషి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నానంటూ విస్పష్టమైన ప్రకటన చేశారు. పాలనలో విఫలమైన బోరిస్ గద్దె దిగాలంటూ మైఖేల్ డిమాండ్ చేయడంతో బోరిస్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌కు మైఖేల్ మద్దతు లభించడం కీలకంగా మారింది. ప్రధాని పదవి చేపట్టాల్సిన వ్యక్తిలో ఉండాల్సిన నైపుణ్యాలన్నీ రిషిలో ఉన్నాయని మైఖేల్ గోవ్ వ్యాఖ్యానించారు.














