Skip to main content

Namaste NRI

న్యూజీలాండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు న్యూ జీలాండ్‌లోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. న్యూజీలాండ్‌ టీఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షుడు జగన్‌ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎంతో మంది అమరుల త్యాగం, కేసీఆర్‌ పోరాట పటిమతో స్వారాష్ట్ర కాంక్ష నెరవేరిందన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌కు మనందరి సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌, విజయభాస్కర్‌ రెడ్డి కొసన, అరుణ్‌ ప్రకాష్‌, నర్సింగ రావు ఇనగంటి,  కృష్ణారెడ్డి ఆరేపల్లి, బాలవెను బీరమ్‌, గిరిధర్‌ మోర్ల, పానుగంటి శ్రీనివాస్‌, మోహన్‌ రెడ్డి బీరపు, కల్యాణ్‌ రావు కాసుగంటి, వ్యాపారవేత్తలు స్నిత ప్రజ్ఞ అల్లం, కృష్ణ కుమార్‌ పూసర్ల శ్రీని తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News