Skip to main content

Namaste NRI

సెప్టెంబర్‌ 24న డల్లాస్‌లో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ ట్రోఫీ

డల్లాస్‌లో సెప్టెంబర్‌ 24న సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ ట్రోఫీ, జెర్సీని ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ  సినిమా విజయవంతం అయినప్పుడు కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు కలిగే సంతృప్తి చాలా గొప్పదన్నారు. ఒక ఉద్యమంలా బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించడానికి కారణం కూడా అదే. మనకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏమిస్తున్నామని ఉద్భవించిన ప్రశ్నలో నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు అన్నారు. ఉన్నత విద్యావంతులు కాకపోయినా మేమంతా ఈ రోజు రూ.లక్షల్లో సంపాదిస్తున్నామంటే అది చిత్ర పరిశ్రమ ద్వారా ప్రేక్షకులు ఆ అవకాశం ఇచ్చారు. అలాంటి వారికి తిరిగి ఎంతో కొంత మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చి తీరాలి అని అన్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించే ఆసుపత్రికి రూ.20 లక్షల చెక్‌ను సీసీసీకి చిరంజీవి అందజేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు శ్రీకాంత్‌, త‌రుణ్‌, థ‌మ‌న్‌, సుధీర్ బాబు, ప్రమఖ సంగీత దర్శకుడు తమన్‌, ఇత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events