Skip to main content

Namaste NRI

హెచ్‌-1బీ వీసాలో మార్పులు.. భారతీయులపై

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్‌-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్తలకు మెరుగైన పని వసతులను కల్పించనుంది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌(వలసేతర) వర్కర్స్‌కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన విధివిధానాలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసె స్‌(యూఎస్‌సీఐఎస్‌) అధికారులు సిద్ధం చేశారు.

వీసాలకు సంబంధించి కాంగ్రెస్‌ పేర్కొన్న ఏటా 60 వేల పరిమితిని మించరాదని నిర్ణయించారు. ఈ వీసా ఆయా సంస్థలకు మూడు నుంచి ఆరేళ్లపాటు విదేశీ కార్మికులను, ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఇస్తుంది. అయితే, హెచ్‌-1బీ వీసా ఉన్నవారు గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తూ తరచుగా తమ వర్క్‌ వీసాలను రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై పెట్టుబడిదారులు, ప్రజలు, ఆయా సంస్థల యజమానులు తమ అభిప్రాయం చెప్పాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కోరింది.

హెచ్‌-1బీ వీసాల్లో చేసిన మార్పులు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావడం, పనిచేసే ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శించడం, హెచ్‌-1బీ వీసా కోరుకునే భారతీయులను అదనంగా స్ర్కూటినీ చేయడం వంటివి భారతీయులకు ఇబ్బందిగా మారుతుందని తెలుస్తోంది. అయితే చట్టబద్ధమైన ఉపాధిని పొందే క్రమంలో ఎలాంటి నకిలీలకు అవకాశంలేకుండా చూసేందుకే మార్పులు చేసినట్టు అమెరికా చెబుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events