Skip to main content

Namaste NRI

పాకిస్థాన్‌కు చైనా భారీ సాయం

పాకిస్థాన్‌కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ వెల్లడిరచారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనాకు చెందిన బ్యాంకుల కన్సార్షియం తమ దేశానికి సుమారు 2.3 బిలియన్‌ డాలర్ల అప్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని, మరికొన్ని రోజుల్లో ఈ సొమ్ము పాక్‌ ఖాతాలకు చేరుతుందని ఇస్మాయిల్‌ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఈ సొమ్ము స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఎస్‌బీపీ) ఖాతాకు చేరినట్లు ఆయన వెల్లడిరచారు. దీంతో పాక్‌ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయని తెలిపారు. కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాక్‌ శ్రీలంక బాటలోనే నడిచేలా కనిపించింది. చివరకు ప్రజలు తాగే టీ కూడా రోజుకు రెండు, మూడు కప్పులే తాగాలని ఆ దేశ మంత్రులు సూచనలు ఇచ్చే స్థాయికి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇలాంటి సమయంలో చైనా నుంచి ఆర్థిక సహాయం లభించడంతో ఆ దేశం కొంత తేరుకున్నట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News