అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ తొలిసారి స్పందించారు. తాలిబన్లు తమతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ఆఫ్గనిస్తాన్ పునర్మిర్మాణానికి తమ వంతు సహాయం అందిస్తామని డ్రాగన్ దేశం వెల్లడిరచింది. కాగా అమెరికా బలగాలు అఫ్గన్ గడ్డ నుంచి వెనుదిరిగినప్పటి నుంచి చైనా తాలిబన్లతో సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దేశ ప్రజలకు, విదేశీ రాయబారులకు వారు పూర్తి భద్రత కల్పిస్తారని భావిస్తున్నాం అన్నారు. చైనాకు హాని తలపెట్టే నిమిత్తం ఏ దేశాన్ని తమ భూభాగంలోకి రానివ్వబోమని హామీ ఇచ్చారు. తాలిబన్ల తిరుగుబాటు క్రమంలో అఫ్గాన్ నుంచి చాలా మంది చైనీయులు వెనక్కు వెళ్లిపోవడం గమనార్హం.