అమెరికన్ ఆశా కిరణం, టెన్నిస్ క్రీడాకారిణి కొకో గాఫ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ 17 ఏండ్ల యువ సంచలనం టోక్కో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తాను టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. ఈ వార్తను మీతో పంచుకోవడం నిరాశ కలిగించింది. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాలన్నది నా చిరకాల కల. భవిష్యత్తులో ఇది నిజమవడానికి నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను అని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న కొకో గాప్ ట్విట్టర్ ద్వారా వెల్లడిరచింది. ఒలింపిక్స్‌లో ఆడనున్న అమెరికా బృందానికి ఆమె బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. ప్రతిఒక్క ఒలింపియన్, ఒలింపిక్ కుటుంబ అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.