బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి తన యాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన కమల సైన్యం మొదటి 10 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం నాలుగు విడతల్లో ఈ యాత్ర జరుగుతుంది. మొదటి విడత యాత్ర అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పాదయాత్ర విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 29 కమిటీలను నియమించింది. యాత్ర ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు బండి సంజయ్ వెంట ఈ కమిటీ సభ్యులు ఉంటారు. పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు భోజన సదుపాయాలు, బస ఏర్పాట్లు చూసుకోనున్నారు.