Skip to main content

Namaste NRI

లేడీ సూపర్‌స్టార్‌ బర్త్‌డే సందర్భంగా కనెక్ట్‌ టీజర్‌

అశ్విన్‌ శరవనన్‌ దర్శకత్వంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటిస్తున్న చిత్రం కనెక్ట్‌. నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కనెక్ట్‌ టీజర్‌ను విడుదల చేశారు. నయనతార తన గదిలో భయంభయంగా కనిపిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి డోర్‌ను కొడుతున్నాడు. బ్యాక్‌ డ్రాప్‌లో భయంతో కూడిన అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఇంకో రూం తలుపు తెరవగా బెడ్‌పై షాక్‌ లుక్‌లో ఉన్న యువతి కనిపిస్తుంది. టీజర్‌లోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తూ అసేలం జరుగుతోందని ఆలోచింపజేస్తూ హార్రర్‌ థ్రిల్లర్స్‌ ను ఇష్టపడే మూవీ లవర్స్‌లో  సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్‌. ఈ చిత్రంలో బాలీవుడ్‌ దర్శక నిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌తో పాటు, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News