Namaste NRI

హ‌మాస్‌ను మ‌ట్టుబెట్టండి…నిక్కీ హేలీ

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ మ‌ధ్య భీక‌ర దాడులు కొన‌సాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హ‌మాస్ మెరుపు దాడుల‌ను ప్ర‌ముఖ ఇండో అమెరిక‌న్లు తీవ్రంగా ఖండించారు.  ఇజ్రాయెల్‌పై హ‌మాస్ దాడిని ఖండించిన రిపబ్లిక‌న్ అధ్య‌క్ష అభ్య‌ర్ధి  నిక్కీ హేలీ హ‌మాస్ ఉగ్ర మూకల‌ను మ‌ట్టుబెట్టాల‌ని ఇజ్రాయెల్‌ను కోరారు.  ఇజ్రాయెల్, అమెరికాకు మ‌ర‌ణ‌శాస‌నం అంటూ హ‌మాస్‌, వారికి వ‌త్తాసు ప‌లికిన ఇరాన్ నిన‌దిస్తున్నాయ‌ని, ఇది త‌మ‌కు గుర్తుంటుంద‌ని, హ‌మాస్‌, హెజ్‌బొల్లా, హౌతీస్‌, ఇరానియ‌న్లు త‌మ‌ను ద్వేషిస్తున్నందున తామంతా ఇజ్రాయెల్‌కు వెన్నుద‌న్నుగా నిలిచామ‌ని నిక్కీ హేలీ పేర్క‌న్నారు. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు త‌మ సంఘీభావం ఎంతో అవ‌స‌ర‌మ‌ని, అందుకే తామంతా ఐక్యంగా ఇజ్రాయెల్ వెన్నంటి ఉంటామ‌ని ఆమె పేర్కొన్నారు. హ‌మాస్‌ను మ‌ట్టుబెట్టాల‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహును కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events