అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలస దారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్నా హెచ్1-బీ వీసాకు క్రేజ్ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో హెచ్1-బీ వీసా కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ఒక్కొక్కరు లక్ష డాలర్లు చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.83 లక్షలకు పైగా ప్రీమియం ఫీజుగా చెల్లించినట్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ పేర్కొన్నారు. సబ్‌కమిటీ సమావేశంలో మాట్లాడిన ముల్లిన్ ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 2.86 లక్షల హెచ్1-బీ వీసా దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు.

2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్-1బీ వీసా అభ్యర్థుల్లో దాదాపు రెండు లక్షల మంది తమ దరఖాస్తులు వేగంగా ప్రాసెస్ చేయడం కోసం 1 లక్ష డాలర్లు చెల్లించినట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించారు. మంగళవారం సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీ ముందు వివరాలు వెల్లడిస్తూ 2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.86 లక్షల హెచ్-1బీ వీసా దరఖాస్తులు అందినట్టు ఆయన తెలిపారు. వాటిలో 2 లక్షల మందికి పైగా 1 లక్ష డాలర్లు చెల్లించి తమ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారని అని ముల్లిన్ చెప్పారు. 1 లక్ష డాలర్లు చెల్లించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ సుమారు 15 రోజుల్లో పూర్తవుతుండగా, సాధారణ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి దాదాపు ఏడున్నర నెలలు పడుతోంది.





























