Namaste NRI

ధమాకా ఫస్ట్‌ సింగిల్‌  రిలీజ్‌

రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న చిత్రం ధమాకా. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్‌ జింతాక్‌ లిరికల్‌ వీడియో విడుదలయింది. మహామాస్‌ అనేలా ఈ పాట ఉంది. చిత్ర సంగీతదర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ఈ మాస్‌ నంబర్‌కి స్వరాలందించడంతో పాటు పాడారు కూడా. ఫీమేల్‌ వాయిస్‌కి మంగ్లీ గొంతు కలిపారు. రవితేజ, శ్రీలీల మాస్‌ డ్యాన్స్‌ ఈ పాటకు ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాటో గ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని విజువల్‌ వండర్‌లా ఈ పాటను చిత్రీకరించారు అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే ప్రసన్నకుమార్‌ బెజవాడ అందిస్తుండగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు వేగంగా సాగుతున్నాయి.  ఈ చిత్రానికి సహనిర్మాత : వివేక్‌ కూచిభొట్ల.

Social Share Spread Message

Latest News