Skip to main content

Namaste NRI

కడుపుబ్బా నవ్వులతో ధూం ధాం : చేతన్‌కృష్ణ

చేతన్‌కృష్ణ  కథానాయకుడిగా సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్‌ రామ్‌కుమార్‌ నిర్మించిన చిత్రం ధూం ధాం.  నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చేతన్‌కృష్ణ మాట్లాడుతూ ధూం ధాం సినిమాలో ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు ఉండవు. వందశాతం వినోదంతో ఆకట్టుకుంటుంది. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది అన్నారు.   రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని, హీరోగా బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరిచానని చెప్పారు.

చక్కటి ప్రేమకథతో పాటు, ఆద్యంతం హాస్యంతో సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా తెలిపారు. నిర్మాత రామ్‌కుమార్‌ మాట్లాడుతూ మా అబ్బాయి చేతన్‌కృష్ణ కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. ఏ విషయంలోనూ రాజీపడకుండా తీశాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. హెబ్బాపటేల్‌, సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్నందించారు.

Social Share Spread Message

Latest News