Skip to main content

Namaste NRI

సందీప్ కు జోడిగా దివ్యాంక కౌశిక్

సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం మైఖేల్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది.  కాగా ఇందులో హీరోయిన్‌గా దివ్యాంక కౌశిక్‌ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మైఖేల్‌ పాత్ర చేస్తున్న సందీప్‌కు జోడిగా కనిపిస్తారు దివ్యాంశ. ఈ చిత్రంలో దర్శక నటుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  మజిలితో పాటు పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక ఈమె. యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. దర్శకుడు రంజిత్‌ విభిన్నమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. సందీప్‌ కిషన్‌ పాత్ర ఎంతో గాఢతతో కూడుకుని ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకీ ప్రాధాన్యం ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ చెర్రీ. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News