Skip to main content

Namaste NRI

జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు, అక్కినేని శతజయంతి ఉత్సవాలు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, వారసత్వాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి అని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.   వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం దీపావళి సంబరాలు, అక్కినేని శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ కథానాయిక సంయుక్త మీనన్ పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఈ వేడుకలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలుగువారి సాంప్రదాయ వేషధారణల తో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ  జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు.జీడబ్ల్యూటీసీఎస్ 49 వసంతాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతిఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞత లు. ఈ కార్యక్రమానికి భోజన వసతులు సమకూర్చిన ప్రదీప్ గౌర్నేనికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ మనదైన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఏ దేశ మేగినా నలుగురితో కలిసి పోవటమే తెలుగువారి గొప్పదనమని అన్నారు. సంస్థ మాజీ అధ్యక్షులు పాలడుగు సాయిసుధ, మన్నె సత్యనారాయణ, మూల్పూరి వెంకట్రావు, నరేన్ కొడాలి, సాయి కాంత, తేజ రాపర్ల తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చంద్ర మాలావతు, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, ఉమాకాంత్, విజయ్ అట్లూరి, రాజేష్ కాసారనేని, శ్రీవిద్య సోమతో పాటు రామ్ చౌదరి ఉప్పుటూరి, నాగ్ నెల్లూరి, అనిల్ ఉప్పలపాటి, సత్య సూరపనేని, సుధీర్ కొమ్మి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events