Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌

2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష రేసులో పోటీపడనున్నట్లు  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వైట్‌హౌజ్‌ కోసం ఎన్నికల్లో నిలవనున్నట్లు అమెరికా ఎన్నికల సంఘం ముందు ట్రంప్‌ తన పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, వైభవంగా నిలిపేందుకు దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. రిపబ్లిన్‌ పార్టీకి  చెందిన ట్రంప్‌ 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఆయన ఓడిపోయారు. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌పై వ్యతిరేకత ఉన్నా 2024 లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా  పోటీ చేయనున్నట్లు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News