Skip to main content

Namaste NRI

రామయ్య పెళ్లి ఓకే చెప్పిన ఈసీ

భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 4న రాముడి కల్యాణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖ లో పేర్కొన్నారు. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రేపు కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చింది.

Social Share Spread Message

Latest News