Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ ఆందోళన… అమెరికాలో  

 అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక అత్యవసర స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు ఏడాదికి ట్రిలియన్‌ డాలర్లు (రూ.84 లక్షల కోట్లు) దాటిపోయాయని, రక్షణ రంగానికి చేసిన కేటాయింపుల కంటే ఇది ఎక్కువని పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో మస్క్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈ వడ్డీ చెల్లింపులు ఫెడరల్‌ ట్యాక్స్‌ ఆదాయంలో 23 శాతమని తెలిపారు. జాతీయ రుణం 35.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రుణం 36 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా వేసినట్టు వివరించారు.

Social Share Spread Message

Latest News