Skip to main content

Namaste NRI

ఎంగేజ్మెంట్‌ షూటింగ్‌ పూర్తి

ప్రవీర్‌ శెట్టి, ఐశ్వర్య గౌడ జంటగా రాజు బొనగాని దర్శకత్వంలో జయరామ్‌ దేవ సముద్ర నిర్మిస్తున్న చిత్రం ఎంగేజ్మెంట్‌. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఆగస్టులో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, కూర్గ్‌, చిక్‌ మంగళూరు, మైసూర్‌, గోవా, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలలో అనుకున్న షెడ్యూల్స్‌లో షూట్‌ పూర్తి చేశాం. అవుట్‌పుట్‌ కూడా ఊహించిన దాని కంటే క్యాలిటీగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాల్, ఒడియా భాషలలో విడుదల చేస్తున్నట్లు  తెలిపారు.

Social Share Spread Message

Latest News