తిరుమల తిరుపతి దేవస్థానం వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి. శివశకంర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ… టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుంది. మూడు నెలల్లోగా దీనిపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని కోరింది. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది.