Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్నా  : రిషి

బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్నానని భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ప్రకటించారు. పోటీకి కనీసం 100 మంది కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల మద్దతు అవసరం. కాగా రిషికి ఇప్పటికే 128 మంంది మద్దతుంది. బ్రిటన్‌ ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని అనుకుంటున్నా. అందుకే బరిలో దిగా అంటూ రిషి సునాక్‌ తెలిపారు. తాజా మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ కూడా రిషికి మద్దతు ప్రకటించారు.  ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ అనూహ్య రాజీనామాతో కొత్త ప్రధానిని ఎన్నుకొనే ప్రక్రియ  ప్రారంభం కావటంతో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను రిషి ఈ సారి నేరుగా ఢీకొట్టనున్నారు. నాలుగు నెలల క్రితం వరకు బోరిస్‌ ప్రధానిగా, ఆయన మంత్రివర్గంలో రిషి ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News