Namaste NRI

అలిపిరికి అల్లంత దూరాన

రావణ్‌ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా ప్రధాన పాత్రల్లో జె.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. రమేష్‌ డబ్బుగొట్టు, పి.రెడ్డి రాజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. రావణ్‌ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఇది. వినూత్నమైన రాబరీ థ్రిల్లర్‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. తొలి సినిమాతోనే ఆనంద్‌ ప్రత్యేక మార్క్‌ చూపించబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ  విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  ఈ సినిమాకి సంగీతం: ఫణి కల్యాణ్‌, ఛాయాగ్రహణం: డిజికె.

Social Share Spread Message

Latest News