అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఓ బార్ వెలుపల దుండుగులు కాల్పులు జరిపిన ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు షూటర్లు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్లాక్ కారులో నుంచి దుండగులు నడిరోడ్డుపై వెళుతున్న జనంపై కాల్పులు జరిపారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. దుండగులు 40 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిసింది. క్షతగాత్రలను సమీప ఆసత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉండగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెaలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.














