Skip to main content

Namaste NRI

ధూం ధాం మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ధూం ధాం. సాయికిశోర్‌ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్‌. రామ్‌కుమార్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ప్రోమోని మేకర్స్‌ విడుదల చేశారు.

గాయని మంగ్లీ పాడుతూ, ఈ పాటలో నర్తించినట్టు సాంగ్‌ ప్రోమోలో తెలుస్తున్నది. మల్లెపూల ట్యాక్సీ తేరా మల్లేశా అంటూ సాగిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, గోపీసుందర్‌ స్వరపరిచారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో సాయికుమార్‌, వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: ప్రవీణ్‌వర్మ, కెమెరా: సిద్ధార్థ్‌ రామస్వామి, నిర్మాణం: ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌.

Social Share Spread Message

Latest News