Namaste NRI

బనారస్‌ మూవీ నుంచి తొలి తొలి వలపే సాంగ్ విడుదల

జైద్‌ఖాన్‌ కథానాయకుడిగా జయతీర్థ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం బనారస్‌. సోనాల్‌ మాంటెరో కథానాయిక. తిలక రాజ్‌ బల్లాల్‌ నిర్మాత. ఈ చిత్రంలోని తొలి తొలి వలపే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అజనీస్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్‌, భాస్కరభట్ల సాహిత్యమందించారు. కార్తీక్‌, కె.ఎస్‌.చిత్ర ఆలపించారు. బనారస్‌ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. సైన్స్‌  ఫిక్షన్‌ అంశాలతో మిళితమై ఉంటుంది. జైద్‌, సోనాల్‌ జోడీ చూడముచ్చటగా ఉంటుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: కె.ఎం. ప్రకాష్‌, ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి.  ఈ సినిమా నవంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో  నిర్మాత సతీష్‌ వర్మ విడుదల చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News