Namaste NRI

నాలుగేళ్ల తర్వాత మొదటిసారి … పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు

పాకిస్థాన్‌కు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  పాకిస్థాన్‌కు 450 మిలియన్‌ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు  బైడెన్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌`16 ఫైటర్‌ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది. 450 బిలియన్ల డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్‌`16 యుద్ధ విమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత విక్రయం గురించి కాంగ్రెస్‌కు వెల్లడిరచింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాక్‌ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హానీ ఏర్పడదని చెప్పింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్‌ భాగస్వామి కాదని పేర్కొంటూ 2018లో పాకిస్థాన్‌కు అన్ని రక్షణ, భద్రతా సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

Social Share Spread Message

Latest News