Namaste NRI

దసరా మూవీ నుంచి ఫ్రెండ్‌షిప్‌ డే పోస్టర్‌

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దసరా. పాన్‌ ఇండియా స్థాయిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ కథానాయిక. ఆదివారం (ఆగస్టు7) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. దీనికి ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ ఇరగ మరగ చేద్దాం అనే క్యాప్షన్‌ను జత చేశారు. కాగా ఈ  చిత్రం కోసం నాని దాదాపు 7 కేజీల బరువు పెరిగారు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంగీతం : సంతోష్‌ నారాయణ్‌, ఎడిటర్‌ : నవీన్‌ నూలి, సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాస్‌ కొల్లా.

Social Share Spread Message

Latest News