Skip to main content

Namaste NRI

హీరోగా గాలి జనార్థన్‌ రెడ్డి కుమారుడి సినీరంగ ప్రవేశం

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అనేక బ్లాక్‌బాస్టర్లను నిర్మించింది. కర్నాటక మాజీ మంత్రి, పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా పరిచయం అవుతున్నారు.ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తోంది. రాధాకృష్ణ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తం సన్నివేశానికి ఎస్‌ఎస్‌ రాజమౌళి క్లాప్‌ కొట్టారు. కన్నడ నటుడు రవి చంద్ర కెమెరా స్విచాన్‌ చేశారు.  ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ హీరోగా ఎదిగేందుకు కావాల్సిన లక్షణాలు కిరీటిలో కనిపిస్తున్నాయి. బాగా నటించగలడు, డ్యాన్సులు, ఫైట్స్‌ చేయగలడు. కిరిటీ వారాహి సంస్థలో పరిచయం కావడం సంతోషంగా ఉంది అన్నారు. హీరో కిరిటీ మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావడానికి అప్పు (పునీత్‌) స్ఫూర్తి. అద్భుతమైన సాంకేతిక నిపుణులతో పనిచేయడం నా అదృష్టం అన్నారు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు.  హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల మాట్లాడుతూ నేను కిరీటి కటుంబ స్నేహితులం. ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది అన్నారు. జెనీలియా మాట్లాడుతూ నటనకు దూరమై పదేళ్ళు అవుతోంది. మళ్లీ నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.  శివరాజ్‌ కుమార్‌ వీడియో సందేశం పంపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, సెంథిల్‌, ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సాయికొర్రపాటి నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events