Namaste NRI

ఇర్వింగ్‌ లో ఘనంగా గణేష్‌ చతుర్థి వేడుకలు

అమెరికాలోని డల్లాస్‌ నగరం ఇర్వింగ్‌ సిటీలో గల రివర్‌ సైడ్‌ విలేజ్‌ కమ్యూనిటీలో వినాయక చవితిని కమ్యూనిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతిరోజూ సంప్రదాయ, ఆటపాటలతో హోరెత్తించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకొని అతిథులని అలరించారు. ఇండియా నుండి వచ్చిన  తల్లిదండ్రులు కూడా పిల్లలతో పోటీగా నృత్యం చేసి సందడి చేశారు. ఎప్పటిలానే లడ్డు వేలం ఈ సంవత్సరం కూడా చాలా హుషారుగా నడిచింది. మొత్తం 13 లక్షలకు పైగా పాట పాడుకోవడం జరిగింది. తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో, ఆప్యాయతలతో దాదాపు 350 మంది అథిథులకు ఎన్నో రకాల పిండి వంటలతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. చివరి రోజైన నిమజ్జనం రోజున వినాయకుడి ముందు పిల్లలు, పెద్దలు రంగులతో ఎంతో సంతోషంగా హోలీ, దాండియా ఆడారు. దాంతో స్వదేశంలో ఉండే పండగ వాతావరణాన్ని డల్లాస్‌కి తీసుకువచ్చినట్లైంది. వేడుకుల ముగింపుగా గణపతిని పుర విధులలో ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events