Namaste NRI

జెంటిల్‌మెన్‌2 నాయికగా ..

అర్జున్‌ హీరోగా నటించిన జెంటిల్‌మెన్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్నది జెంటిల్‌మెన్‌ 2. ఈ సినిమాను కేటీ కుంజుమన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా మలయాళ హీరోయిన్‌ నయనతార చక్రవర్తి ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు.  బాలనటిగా మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ భామ. నయనతార చక్రవర్తి గతంలో తెలుగు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో అతిథి పాత్రలో నటించింది. ఇప్పుడీ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మరో నాయిక ఉంటుందని త్వరలోనే ఆమె ఎవరనేది వెల్లడిస్తామన్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందీ చిత్రం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో అధికారికంగా వెల్లడిరచనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events