Namaste NRI

లక్ష్యం నెరవేర్చుకున్న … తార

కిషోర్, సత్యకృష్ణ జంటగా నటిస్తున్న తార చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. యం.బి (మల్లిబాబు) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వి.ఆర్.పి.క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్నారు. బేబీ తుషార, బేబీ నాగహాసిని, మాస్టర్ హర్షవర్ధన్, అజయ్ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కాశీవిశ్వనాథ్ క్లాప్నివ్వగా, సాయివెంకట్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంది? చివరకు తన లక్ష్యాన్ని ఎలా సాధించిందన్నదే చిత్ర కథాంశం అన్నారు. ఈ నెల 14 నుంచి ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం అని నిర్మాత తెలిపారు. గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కెమెరా: పి.యస్. మణికర్ణన్, సమర్పణ: పద్మావతి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: యం,బి. (మల్లిబాబు). ఈ కార్యక్రమంలో జగన్, సహనిర్మాత సాయిమల్లి, అరుణ్రామ్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News