Skip to main content

Namaste NRI

గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. అమెరికా పోలీస్‌ల వెల్లడి

అమెరికా లోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీస్‌లు ఖండించారు. వాస్తవానికి ఆ సంఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తరువా త ఈ ప్రకటన చేశారు. అమెరికా లోని హోల్ట్ అవెన్యూలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పు లు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీస్‌లు రంగం లోకి దిగి దర్యాప్తు చేపట్టా రు. మృతు డు గోల్డీబ్రార్ కాదని, లెఫ్టినెంట్ విలియం జే డూలే వెల్లడించారు.

మీరు ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డె  అని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News