Namaste NRI

అమెరికా గుడ్ న్యూస్… వీసా దరఖాస్తుదారులకు

అగ్రరాజ్యం అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకుని అపాయింట్మెంట్స్ స్లాట్స్ కోసం వేచి చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. అమెరికా తాజాగా లక్ష అపాయింట్మెంట్ స్లాట్స్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్, ఎల్ వీసా దరఖాస్తుదారులకు ఈ అపాయింట్మెంట్ స్లాట్స్ మంజూరు చేసింది. వేల మంది ఇప్పటికే తమ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు. భారత్లో వెయిటింగ్ పీరియడ్ సగానికి పడిపోయింది. హెచ్, ఎల్ వీసాదారులకు అమెరికా ఇచ్చే ప్రాధాన్యానికి ఇది నిదర్శనం అని ఇండియాలోని అమెరికా ఎంబసీ తాజాగా తెలిపింది. బీఏ, బీ2 వీసాల విషయంలో వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు త్వరలో చర్యలు చేపడతామని పేర్కొంది. కొత్త అపాయింట్మెంట్ స్టాట్స్ను అందుబాటులోకి తేబోతున్నట్టు అమెరికా కాన్సులార్ అఫైర్స్ మంత్రి డాన్ హెఫ్లిన్ గత నెలలోనే ప్రకటించారు.

Social Share Spread Message

Latest News