Skip to main content

Namaste NRI

భారతీయులకు గుడ్ న్యూస్…ఏడేళ్లు నివాసముంటే

అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డు మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్‌ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్‌ పడిల్లా, ఎలిజబెత్‌ వారెన్‌, బెన్‌ రే లుజాన్‌, సెనేట్‌ మెజారటీ విప్‌ డిక్‌ డర్బన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికాలో ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. గతంలో సవరించిన ఇమిగ్రేషన్‌ విదానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారి రిజిస్ట్రీ కటాప్‌ తేదీని సవరించాం. దీనితో మరింత మంది వలసదారులు చట్టబద్ద శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చిని  సెనేటర్‌ పడిల్లా తెలిపారు.

ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్‌  టర్మ్‌ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్‌`1 బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది అని వలసదారుల తరపున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూటీ డాట్‌ యుఎస్‌ అంచనా వేసింది.

Social Share Spread Message

Latest News