Namaste NRI

గ్రాండ్‌గా రూమ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

అభిషేక్‌ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూమ్‌. అశ్విన్‌ రమేష్‌. కె సమర్పణలో వీయస్‌. సుబ్బారావు నిర్మించారు. పద్మమగన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్‌ రిలీజ్‌ చేశారు. పద్మమగన్‌లాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో రూమ్‌ తీశాం. గురజాల సుబ్బారావు సపోర్ట్‌తో తీసిన యూత్‌ ఫుల్‌ చిత్రం ఇది అన్నారు వీయస్‌ సుబ్బారావు. అందరికీ వినోదం పంచాలనే ఈ సినిమా తీశాం. ఈ మూవీ షూటింగ్‌ 60 శాతం ఓకే రూమ్‌లో చేశాం అన్నారు పద్మమగన్‌. దర్శకుడు కన్మని, సహ నిర్మాత అశ్విన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినోద్‌ యాజమాన్య మాట్లాడారు. అన్ని కారక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా : యమ్‌యస్‌.ప్రభు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events