Namaste NRI

రేసులో లేరు కానీ… ఉంటే మళ్లీ ఆయనే ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని రేసులో బోరిస్‌ జాన్సన్‌ లేరు కానీ, ఉండి ఉంటే ఆయనకే మళ్లీ ప్రధాని పీఠం దక్కి ఉండేది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్టు స్కై న్యూస్‌ కోసం నిర్వహించిన యాగవ్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాన్సన్‌ కనుక పోటీలో ఉండి ఉంటే 46 శాతం ఓటు ఆయనకే వచ్చి ఉండేవని ఇందులో వెల్లడైంది. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌కు 24 శాతం,  సునాక్‌కు 23 శాతం ఓట్లు మాత్రమే  వచ్చేవని వెల్లడిరచారు. అంతే కాదు బోరిస్‌ రాజీనామా కోసం ఒత్తిడి తీసుకు వచ్చి తప్పు చేశారని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవి అభ్యర్థిని తేల్చేందుకు  ఓటు వేసే అర్హత ఉన్న 1,098 మంది పార్టీ సభ్యులతో ఈ నెల 12, 17 తేదీల మధ్య నిర్వహించిన యూగవ్‌ సర్వేలో  ఈ విషయాలు వెలుగు చూశాయి.

Social Share Spread Message

Latest News