Namaste NRI

శాసన సభ మూవీలో హెబ్టాపటేల్ స్పెషల్ సాంగ్

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా సీనియర్‌ నటుడు డా.రాజేంద్ర ప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం శాసన సభ. ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్‌ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. నిర్మాతలు  పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ ప్రత్యేక పాట ఆకర్షణగా నిలుస్తుంది. రవిబసుర్‌ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుంది. ఈ పాటకు ప్రేమిక్షిత్‌,  నృత్యరీతులు అందించగా , పాపులర్‌ సింగర్‌ మంగ్లీ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్‌ సాప్పని, షణ్ముణం సాప్ననిలు సాబ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

Social Share Spread Message

Latest News