ఉక్రెయిన్‌లో రష్యా దాడులు పదో రోజుకు చేరుకున్నారు. ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కీవ్‌లు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రెచ్చగొట్టడం వల్లనే కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐరోపాలోనే అది పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని, ఇందులో ఆరు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అలాంటి చోట కాల్పులకు ఉక్రెయిన్ లేదా రష్యా సైనికులు సాహసం చేయరని తెలిపారు. అయితే అధ్యక్షుడు రెచ్చగొట్టడం వల్లనే అక్కడి శిక్షణా కేంద్రం నుంచి జరిగిన స్వల్ప కాల్పులు ఏకంగా అణు విదుయత్ ప్లాంట్‌పై దాడికి పురిగొల్పిందన్నారు. ఇది కచ్చితంగా రెచ్చగొట్టే కుట్ర అని, అమెరికా బ్రిటన్‌కు జెలెన్‌స్కి తప్పుడు సమాచారం ఇచ్చి రష్యాను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు.














