Skip to main content

Namaste NRI

కిస్మత్ ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన హీరో సత్య దేవ్

నరేశ్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, అవసరాల శ్రీనివాస్‌, విశ్వదేవ్‌, రియా సుమన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం కిస్మత్‌. శ్రీనాథ్‌ బాదినేని దర్శకుడు. కామ్రెడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథిరా ప్రొడక్షన్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని హీరో సత్యదేవ్‌ విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, అవసరాల శ్రీనివాస్‌, విశ్వ దేవ్‌, రియా సుమన్‌ ఎందుకో కలవరపడుతున్నట్లు కనిపించారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు ఉన్నాయి.  కిస్మత్‌ అంటే అదృష్టం. ఈ సినిమా పేరులోనే అదృష్టం ఉంది. కాబట్టి సినిమా మంచి హిట్‌. అందరికీ శుభాకాంక్షలు అని సత్యదేవ్‌ అన్నారు. అజయ్‌ఘోష్‌, టెంపర్‌ వంశీ, చమ్మక్‌ చంద్ర, రచ్చరవి తదితరలు ఇతర పాత్రలు పోషిస్తు న్నారు. కిస్మత్‌ షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.   ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌, కెమెరా: వేదరామన్‌ శంకర్‌, నిర్మాత: రాజు.

Social Share Spread Message

Latest News