బెల్లంకొండ గణేష్ రెండో చిత్రం నేను స్టూడెంట్ సార్. అవంతి దస్సాని నాయిక. రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్ అనే పోలీస్ అధికారి పాత్రలో సముద్రఖని అలరిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.














