Skip to main content

Namaste NRI

వచ్చే ఏడాది తప్పకుండా చేస్తా : ఫరియా అబ్దుల్లా

తరుణ్‌భాస్కర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గాయపడ్డ సింహం. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. గాయపడ్డ సింహం చిత్రంలో తాను అతిథి పాత్రలో కనిపిస్తానని, హీరో తరుణ్‌భాస్కర్‌తో ఓ రొమాంటిక్‌ ట్రాక్‌ కూడా ఉంటుందని, వ్లాగర్‌గా తన పాత్ర కావాల్సినంత వినోదాన్ని పంచుతుందని చెప్పింది. తన పాత్ర పేరు శాలిని అని, ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుందని తెలిపింది.

తరుణ్‌భాస్కర్‌ కామెడీ టైమింగ్‌ అద్భుతమని, ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్‌ కూడా నవ్వు తెప్పిస్తుందని, తమ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయని పేర్కొన్నది. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ప్రస్తుతం కొన్ని కథల్ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది తప్పకుండా సినిమా డైరెక్షన్‌ చేస్తానని చెప్పింది. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. తదుపరి సినిమా వివరాలు తెలియజేస్తూ ప్రస్తుతం భగవంతుడు సిగ్మా చిత్రాల్లో నటిస్తున్నా. మరో రెండు సినిమాలు త్వరలో ప్రారంభమవుతాయి. సత్యదేవ్‌తో ఓ సినిమా ఉంటుంది అని చెప్పింది.

Social Share Spread Message

Latest News