Namaste NRI

ఆమె ఇప్పటికైనా నిజం చెబితే వదిలేస్తా.. లేదంటే

అమెరికా కాంగ్రెస్‌ ( పార్లమెంటు) దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ భర్తపై దాడి చేసిన దుండగుడు డేవిడ్‌ డిపాపే (42) తాను పెలోసీ మోకాళ్లు విరిగ్గొట్టాలనుకొన్నానని పోలీసులకు చెప్పాడు. అతడి దాడిలో పెలోసీ భర్త పాల్‌ గాయపడిన విషయం తెలిసిందే. నాన్నీ కోసం దుండగుడు అడగ్గానే ఆమె లేరనీ, వాషింగ్టన్‌ నుంచి తిరిగి రావడానికి కొన్ని రోజులు పడుతుందని పాల్‌ తెలిపారు. ఆమె వచ్చే వరకు వేచి ఉంటానని డిపాపే హుంకరించి, పాల్‌ చేతులు కట్టేశాడు. డెమోక్రటిక్‌ పార్టీలో అబద్దాలకోరులకు నాన్సీ నాయకురాలు. ఆమె ఇప్పటికైనా నిజం చెబితే వదిలేస్తా. లేదంటే ఆమె మోకాలి చిప్పలు పగలకొడతా అని డిపాపే పోలీసులకు తెలిపారు.

            మోకాళ్లు విరిగిన నాన్సీ చక్రాల కుర్చీలో కాంగ్రెస్‌కు వెళ్లాల్సివస్తుందనీ, తమ చర్యలకు పర్యవసానాలు ఉంటాయని ఇతర సభ్యులకు తద్వారా తెలిపి వస్తుందని అతని ఆలోచన. కెనడా పౌరుడైన  డిపాపే 2000 సంవత్సరంలో అమెరికా వచ్చి వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా ఆక్రమంగా నివసిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News