Skip to main content

Namaste NRI

అలా జరిగితేనే రెండు దేశాల సమస్యకు పరిష్కారం : బైడెన్‌

వెస్ట్‌బ్యాంకును పాలించే పాలస్తీనా అథారిటీ అంతిమంగా గాజా పగ్గాలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు బో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. మేము శాంతి కోసం తపిస్తున్నాం. గాజా, వెస్ట్‌బ్యాంకును ఒకే పాలన ఛత్రం కిందకు తేవాలి. అలా జరిగితే అంతిమంగా రెండు దేశాల సమస్యలకు పరిష్కారం ముందడుగు వేసినట్లే. పాలస్తీనా అథారిటీని బలోపేతం చేయాలి. గాజా నుంచి పాలస్తీనా వాసులకు బలవంతంగా పంపించకూడదు. మళ్లీ పునరాక్రమణలు ఉండకూడదు. ఎలాంటి అవాంతరాలు కల్పించకూడదు అని బైడెన్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News