Namaste NRI

రెండు భాగాలుగా.. శ్రీసత్యసాయి అవతారం 

శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారి గురించి తెలియంది కాదు. అయన్ను భక్తులు కదిలే దైవంగా చూస్తారు. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కోట్లాది మంది భక్తులు అయనకున్నారు. అలాంటి స్వామి గురించి ఇప్పటితరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే మంచి సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పుట్టపర్తి సత్య సాయిబాబా జీవిత కథతో శ్రీ సత్యసాయి అవతారం తెరకెక్కనుంది. దీన్ని తెలుగు, కన్నడ భాషల్లో రెండు భాగాలుగా రూపొందించనున్నామన్నారు దర్శకుడు సాయిప్రకాశ్‌. ప్రముఖ వైద్యులు దామోదర్‌ నిర్మాత. ఈ సినిమా లోగో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మురళీమోహన్‌, సుమన్‌, సాయికుమార్‌, సి కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

                ఈ సందర్భంగా సాయిప్రకాశ్‌ మాట్లాడుతూ నేను తరెకెక్కించిన షిరిడి సాయి చూసి సత్యసాయి బాబా ఆశీర్వదించారు. 1998లోనే తోటపల్లి మధు ఈ కథ రాశారు. దర్శకులు కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్ట్‌  కోసం రంగంలోకి దిగినా, కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది. బాలకాండ, మహిమకాండగా రెండు భాగాలుగా ఈ సినిమాని చేస్తాం. 150 మంది కళాకారులతో నిర్మిస్తాం. దసరా తర్వాత చిత్రీకరణ మొదలవుతుంది అన్నారు. నిర్మాత  దామోదర్‌ మాట్లాడుతూ వంద సినమాలు తీసిన దర్శకుడిగా సాయిగారితో నేను సినిమా చేయడం స్వామి మహిమే అని తెలిపారు. నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ మా పాత్రలను భక్తులకు పరిచయం చేస్తుంటే ఒళ్ళు పులకించింది నా భార్య కూడా ఆశీర్వాదం లభించింది.

Social Share Spread Message

Latest News