Skip to main content

Namaste NRI

భారత్‌ కలిసి ఉండాల్సింది అమెరికాతో… రష్యాతో కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  వాణిజ్య స‌ల‌హాదారు పీట‌ర్ న‌వ‌ర్రో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్‌-రష్యా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరు నియంతలతో మోదీ భేటీ సిగ్గు చేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో నవర్రో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ,  పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. భారత్‌ కలిసి ఉండాల్సింది అమెరికాతో రష్యాతో కాదు  అని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News