టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒక్క రోజే భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో జరిగిన తుదిపోరులో 0`3 తేడాతో ఓడి రజతం కైవసం చేసుకోగా, పురుషుల హైజంప్ పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించాడు. డిస్కస్‌త్రో విభాగంలో మరో అథ్లెట్ వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి కాంస్యం దక్కించుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు దక్కాయి.