Skip to main content

Namaste NRI

ఆసక్తిని రేపుతున్న ఏటీఎం ట్రైలర్  

బిగ్ బాస్‌ ఫేం వీజే సన్నీ, సుబ్బరాజు, రోయెల్‌ శ్రీ, రవిరాజ్‌, కృష్ణ బూర్గుల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న జీ5 ప్రాజెక్ట్‌ ఏటీఎం. దిల్‌ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సీ చంద్రమోహన్‌ డైరెక్షన్‌. హీస్ట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌  ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.  కథకి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే, పాయింట్ ఏమిటనేది అర్థమైపోతుంది. ఓ నలుగురు బస్తీ కుర్రాళ్లు చేసిన దొంగతనం .. వాళ్ల కోసం పోలీస్ ఆఫీసర్ సుబ్బరాజు సాగించే వేట ఈ సినిమాలోని ప్రధానమైన అంశం అనే విషయం తెలిసిపోతోంది.  లైఫ్‌లో ప్రతీ మనిషి సక్సెస్‌ కావడానికి రెండు దారులుంటాయి. ఒకటి కష్టపడి పైకొచ్చేది. రెండోది సులభంగా పైకొచ్చేది. అందరూ కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుంటారు. మేం వాటిని దోచుకుంటాం.. అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్‌.

రూ.25 కోట్లు పోయాయని పోలీస్‌ అంటుండగా,  రూ.25 కోట్లు రెడీ చేసుకుంటే కన్ఫామ్‌గా టికెట్ నీదేనని ఓ పొలిటికల్‌ లీడర్ అంటున్నాడు. ఇంతకీ ఆ డబ్బు ఎవరెత్తుకెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్‌శంకర్‌ కథనందించడం విశేషం. ఏటీఎం జీ5లో జనవరి 20న ప్రీమియర్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్‌ ఆర్‌ విహార్‌ సంగీతం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events