Namaste NRI

ఇది యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌ సినిమా.. అయినా భారీ సక్సెస్‌

సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం అష్టదిగ్బంధనం. బాబా పి.ఆర్‌ దర్శకుడు. మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గురించి హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. ఎనిమిదిమంది స్వార్థపరుల కథ ఇది. స్వార్థంతో వాళ్లు చేసే పనులవల్ల వాళ్లే అష్టదిగ్బంధనం అవుతారు. ఇది యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌ సినిమా. చిన్న సినిమాగా విడుదలవుతున్నా, విడుదలయ్యాక కచ్చితంగా పెద్దస్థాయిలో నిలబడుతుందని మా నమ్మకం. కొత్తగా పరిచయమవుతున్న సూర్య, విషికలకు ఈ సినిమా మంచి బ్రేక్‌ నిస్తుంది అని దర్శకుడు అన్నారు. మూడుకోట్ల బడ్జెట్‌తో తీశామని, తమ సంస్థకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని నమ్మతున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ ఎం.కె.ఎ.కె.ఎ.ఫిలిం ప్రొడక్షన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events