Skip to main content

Namaste NRI

అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇదీ ఒకటి

అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద విపత్తుల్లో ఒకటి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు.  సుడిగాలులు బీభత్సంపై దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సమీక్ష నిర్వహించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆయా ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని బైడెన్‌ వెల్లడిరచారు. అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతైనట్లు సమాచారం. అయితే ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలియదు.  భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. మేఫీల్డ్‌ పట్టణమంతా సుడిగాలులు కారణంగా నేలమట్టమైంది. అక్కడి చారిత్రక భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events